![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం టికెట్ టూ ఫినాలే రేస్ జరుగుతుంది. పోటీదారులు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం. మూడో టాస్క్ ఆడడానికి ఏ ముగ్గురు ఆడుతారో నిర్ణయం తీసుకోమని బిగ్ బాస్ చెప్తాడు. దాంతో అందరు డిస్కషన్ చేసుకొని సుమన్, డీమాన్, కళ్యాణ్ పేర్లు చెప్తారు. ఇక వీరు ముగ్గురు ఆడగా.. అందులో డీమాన్ గెలుస్తాడు. డీమాన్ తన పక్కనున్నా గడిని పొంది ఎవరితో పోటీపడాలనుకుంటాడో చెప్తాడు. భరణితో పోటీపడాలని అనుకుంటున్నాని బిగ్ బాస్ కి డీమాన్ చెప్తాడు.
డీమాన్, భరణికి బిగ్ బాస్ టాస్క్ ఇస్తాడు. అందులో భరణి గెలుస్తాడు. సంఛాలక్ గా తనూజ ఉంటుంది. డీమాన్ టాస్క్ లో స్ట్రక్ అవుతాడు. భరణి టాస్క్ ఫినిష్ చేస్తాడు. టాస్క్ అయ్యాక ఎందుకు ఇలా చేసావ్.. ఇలా చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు అని డీమాన్ పవన్ కి టాస్క్ పెట్టి చూపిస్తుంది. భరణి టాస్క్ గెలిచినందున డీమాన్ గడులని భరణి సొంతం చేసుకుంటాడు.
పవన్ టికెట్ టూ ఫినాలే టాస్క్ నుండి తొలగింపపడుతాడు. దాంతో డీమాన్ పవన్ ఏడుస్తాడు. టికెట్ టూ ఫినాలే రేస్ నుండి సంజన, తనూజ, డీమాన్ తొలగించబడ్డారు. మిగతా అయిదుగురు ఇంకా రేస్ లో ఉన్నారు. టికెట్ టూ ఫినాలే ఎవరు దక్కించుకున్నారో తెలియాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే.
![]() |
![]() |